Homeసినిమా వార్తలుఇంద్ర స్పెషల్ షోలు కన్ఫర్మ్ చేసిన వైజయంతి మూవీస్

ఇంద్ర స్పెషల్ షోలు కన్ఫర్మ్ చేసిన వైజయంతి మూవీస్

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్‌ల పరంపర నడుస్తుంది. మహేష్ బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా సినిమాల తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. ఆయన నటించిన ఇంద్ర సినిమాను ప్రత్యేక షోలు ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్ర రీ-రిలీజ్ గురించి ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించించి మెగా అభిమానులమి ఆనందానికి గురి చేసారు.

అయితే ఇంద్ర సినిమాల స్పెషల్ షోలను ఏ రోజు లేదా ఏ సందర్భంగా ప్రదర్శిస్తారు అనేది ఇంకా ఖచ్చితమైన తేదీ అంటూ ఏదీ వెల్లడి కానప్పటికీ, ఆ ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. ఈ విషయం కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాదు సామాన్య సినీ ప్రేమికులలో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది. ఇంద్ర సినిమా కేవలం మెగాస్టార్ అభిమానులకే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఎంతగానో ప్రభావితం చేసిన ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది.

బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్లుగా సోనాలి బేంద్రే, మరియు ఆర్తీ అగర్వాల్ నటించారు. 2002లో విడుదలైన ఇంద్ర సినిమా, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ గా ఆ సమయంలో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుని అత్యధిక వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా 30 కేంద్రాలలో 175 రోజులు.. 122 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.

READ  నితిన్ కు డాన్స్ రాదు.. నేనే నేర్పించా: అమ్మ రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు

వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అధ్భుతమైన నటనతో పాటు, అలరించే డ్యాన్సులు మరియు మణిశర్మ అందించిన బ్లాక్ బస్టర్ పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. మొక్కే కదా అని పీకెస్తే..పీక కోస్తా, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలొంచుకుని వెళుతున్నా.. లేదంటే ఇక్కడి నుంచి తలలే తీసుకు వెళ్ళేవాడిని వంటి డైలాగులు అలాగే దాయి దాయి దామ్మా ఏ స్థాయిలో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మరి అలాంటి భారీ బ్లాక్ బస్టర్ అయిన ఇంద్ర సినిమా.. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ స్పెషల్ షోలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.. ఖచ్చితంగా మెగా అభిమానుల ఆధ్వర్యంలో సంబరాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి అని తెలుస్తోంది.

Follow on Google News Follow on Whatsapp

READ  మరో వింత వాదన తెరమీదకు తెచ్చిన తెలుగు సినీ నిర్మాతల మండలి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories