నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు యూఎస్ఏలో ప్రీ-సేల్స్ కూడా ట్రెమండస్ కలెక్షన్స్ రాబట్టాయి. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ చిత్రం తన కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ఇస్తుందని, తన గత సూపర్ హిట్ అఖండను అధిగమిస్తుందని బాలయ్య అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
ఇప్పుడు బాలయ్య అభిమానులకు మరో శుభవార్త. జనవరి 11న విడుదల కావాల్సిన విజయ్ ‘వారసుడు’ విడుదల తేదీ తాజాగా వాయిదా పడింది. ‘వారిసు’ తెలుగు వర్షన్ జనవరి 14న విడుదల కానుంది. ఇది బాలయ్య సినిమాకు మొదటి రోజు భారీ అడ్వాంటేజ్ ఇవ్వనుంది. ఎందుకంటే మొదటి రోజున ఈ సినిమాకి పోటీగా వేరే ఏ సినిమా లేదు.
ఇప్పుడు బాలకృష్ణ యొక్క వీర సింహారెడ్డి అత్యధిక స్క్రీన్లతో సోలో రిలీజ్ ను పొందే అవకాశం ఎంతైనా ఉంది మరియు సానుకూల నివేదికల మధ్య విడుదలవుతున్న వాల్తేరు వీరయ్యకు కూడా ఇది ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన మాస్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.
వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ మరియు దునియా విజయ్ కూడా ప్రతికూల పాత్రలలో నటించారు మరియు వారి ఉనికి ఈ సినిమా పై అందరి ఆసక్తిని పెంచింది.