పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా మొత్తం మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అవి అన్ని కూడా ఇప్పటికే కొంత మేర షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్న పవన్, ఎక్కువ సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తున్నారు. ఇక త్వరలో తన మూడు సినిమాల బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వాటిలో సుజీత్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి, హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు ఉన్నాయి. ఇక వీటిలో ముందుగా ఓజి మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. అయితే హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విజయ్ హీరోగా నటించిన తేరికి అఫీషయల్ రీమేక్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
విషయం ఏమిటంటే, ఈ మూవీకి సంబంధించి ఇటీవల పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిశామని నేటి ఒక మీడియా కార్యక్రమంలో భాగంగా నిర్మాత రవిశంకర్ తెలిపారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా మూవీ నుండి చిన్న సర్ప్రైజ్ ఉందని, అలానే మూవీ బ్యాలెన్స్ షూట్ ని జనవరి కల్లా పూర్తి చేస్తాం అని అన్నారు. కాగా 2025 ద్వితీయార్ధంలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.