మాస్ ఆడియన్స్‌లో అద్భుతమైన ఇమేజ్ ఉన్న నందమూరి బాలకృష్ణ ఎవరూ ఊహించని విధంగా “అన్‌స్టాపబుల్” టాక్ షో కోసం హోస్ట్‌గా మారారు. తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో ప్రసారమైన ఈ షో డిజిటల్ స్పేస్‌లో సూపర్ సక్సెస్ అయింది. అందరికీ బాలయ్యలో ఎప్పుడు కనిపించని మరో కోణాన్ని బయటపెట్టింది. మొదటి సీజన్ అద్భుత విజయం సాధించిన తర్వాత రెండో సీజన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు వచ్చారు.
కొంత కాలం గ్యాప్ తర్వాత ఆహా టీమ్ ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 2ని ప్రారంభించింది, ఈసారి ఎక్కువ వినోదం మరియు భావోద్వేగాలతో ఈ షోను రూపొందించారు. కాగా మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ వీడియోకు విశేష స్పందన లభించింది. మరియు ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ భారీ అంచనాల మధ్య నిన్న శుక్రవారం ప్రసారం చేయబడింది. అంతే కాకుండా మొదటి ఎపిసోడ్ భారీ విజయాన్ని సాధించింది.
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2’ మొదటి ఎపిసోడ్‌కు 24 గంటల్లో పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చినట్లు ఆహా OTT వెల్లడించింది. సంచలనం సృష్టిస్తున్న ఈ ఎపిసోడ్ ద్వారా నందమూరి బాలకృష్ణ తనదైన స్టైల్‌లో ఓటీటీ రికార్డులను తిరగరాస్తున్నారు. మరో వైపు యూట్యూబ్‌లో ప్రోమో రికార్డుల సంఖ్య కూడా మోగుతోంది. మూడు రోజులుగా ప్రోమో టాప్ ట్రెండ్స్‌లో ఉండటం విశేషం.
నందమూరి బాలకృష్ణ బావగారు, మరియు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అతిథిగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌లో ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబు జీవితం – ఎన్టీఆర్‌తో పరిచయం – రాజకీయ జీవితం వంటి అంశాల పై బాలకృష్ణ చర్చించారు. బాలయ్య తనదైన శైలిలో చమత్కారమైన ప్రశ్నలతో తన బావగారిని ఆటపట్టించే ప్రయత్నం చేశారు.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 మొదటి సీజన్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా ఘనంగా ప్రారంభమైంది, ఈ టాక్ షో మరియు దాని నుంచి లభించే ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ప్రతిచోటా హాట్ టాపిక్‌గా మారాయని చెప్పవచ్చు. కాగా మొదటి ఎపిసోడ్ కోసం CBNని తీసుకురావాలనే ప్లాన్ అద్భుతంగా పనిచేసింది మరియు టాక్ షో చుట్టూ భారీ బజ్‌ను కూడా సృష్టించింది.