నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఆయన కెరీర్ 109వ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. దీనిని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇకార్ మరోవైపు తెలుగు ఓటిటి మాధ్యమం ఆహాలో కొన్నాళ్లుగా బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న సెలబ్రిటీ ఇంటర్వ్యూ కార్యక్రమం అన్ స్టాపబుల్.
ఇప్పటికే జరిగిన ఈ షో యొక్క మూడు సీజన్స్ అందరినీ ఆకట్టుకుని మంచి రివ్యూస్, రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి. అయితే ఈ ఎంటర్టైనింగ్ షో యొక్క 4 వ సీజన్ షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది. కాగా ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మొదటి సెలబిటీ గెస్ట్ గా రానున్నారని ఇటీవల న్యూస్ వచ్చింది. కాగా దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆహా వారి నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది.
కాగా చంద్రబాబుతో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 25న రాత్రి 8 గం. 30 ని. లకు తమ ఓటిటి లో ప్రసారం చేయనున్నట్టు ఆహా వారు కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తెలిపారు. అలానే ఈ అన్ స్టాపబుల్ సీజన్ 4 యొక్క ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుని షో పై మరింతగా ఆసక్తిని ఏర్పరిచింది. ఈ సీజన్ ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.