యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1. సముద్ర నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈమూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా శ్రీకాంత్, సైఫ్ ఆలీ ఖాన్, టెంపర్ వంశీ, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ నుండి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కంపోజ్ చేసిన ఫియర్ సాంగ్ ఎంతో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది . ఇక తాజాగా ఈ మూవీ నుండి చుట్టమల్లే అనే పల్లవితో సాగే రొమాంటిక్ మెలోడీని రిలీజ్ చేసారు. మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సాంగ్ పై పలు ట్రోల్స్ అయితే ప్రారంభం అయ్యాయి.
ముఖ్యంగా ఈ సాంగ్ ని శ్రీలంక యువ లేడీ సింగర్ అయిన యోహాని పాడిన ఒక సాంగ్ కి కాపీ అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పలువురు ఆడియన్స్ ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా దేవర పార్ట్ 1 మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.