టాలీవుడ్ యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు.
ఇప్పటికే దేవర నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా నిన్న మూవీ నుండి మూడవ సాంగ్ రిలీజ్ చేసారు. దావుదీ అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రచించగా నకాష్ అజీజ్, అకాసా పాడారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈ వీడియో సాంగ్ పై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ట్యూన్ బాగోలేదని, అలానే ఇది విజయ్ నటించిన బీస్ట్ మూవీలోని అరబిక్ కుత్తు మాదిరిగా ఉందని మరికొందరు అంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ సాంగ్ లో డ్యాన్స్ అదరగొట్టినప్పటికీ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ అందించిన స్టెప్స్ ఓల్డ్ స్టైల్ లో ఉన్నాయి తప్ప కొత్తగా లేవనేది మరికొందరి విమర్శ. మరి సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న దేవర ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.