పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే సుజీత్ తీస్తున్న ఓజి మూవీ సెప్టెంబర్ 27న విడుదల అయ్యేది. అయితే మధ్యలో ఎలక్షన్స్ లో పవన్ బిజీ అవ్వడంతో ఆ మూవీతో పాటు ఆయన చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరుమల్లు కూడా బ్యాలన్స్ షూటింగ్ వాయిదా పడ్డాయి.
ఇక నేడు రవితేజ హీరోగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చి డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. మరోవైపు పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని హరీష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, ఆ మూవీ షూట్ త్రివిక్రమ్ వల్లనే ఆలస్యం అవుతోందని తన మిస్టర్ బచ్చన్ మూవీలో ఆయన పై డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా హరీష్ శంకర్ కొన్ని పంచ్ లు పేల్చి కసి తీర్చుకున్నారు.
నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ నుండి రిలీజ్ అయిన రెండు గ్లింప్స్ టీజర్స్ పొలిటికల్ గా ఇంపాక్ట్ ఇచ్చాయి తప్ప పవన్ ఫ్యాన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు. దీనిని బట్టి ఒకరకంగా ఉస్తాద్ మూవీ షూట్ కి త్రివిక్రమ్ అడ్డుపడడం మంచిదే అని భావిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మరి ఫైనల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ని ఏస్థాయిలో అందరినీ ఆకట్టుకునేలా హరీష్ శంకర్ తెరకెక్కిస్తారో చూడాలి.