టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో సమంత రూత్ ప్రభు ఒకరు. తొలిసారిగా అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావె మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన సమంత ఫస్ట్ మూవీతోనే పెద్ద విజయం అందుకున్నారు. ఇక ఆ మూవీలో జెస్సి గా సమంత అందం, అభినయం అందరినీ ఎంతో ఆకట్టుకుంది. అక్కడి నుండి వరుసగా తెలుగు, తమిళ భాషల్లో అనేక అవకాశాలు అందుకున్నారు సమంత. అలానే వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంతో పాటు పలు సక్సెస్ లతో టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ భామగా ఆమె మంచి క్రేజ్ అందుకున్నారు.
ఇక తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా సమంతకు ఎంతో మంచి పేరు ఉంది. ఆ విధంగా నటిగా దూసుకెళ్తున్నారు సమంత. ఇక నేడు జరిగిన అలియా భట్ ప్రధాన పాత్రధారి అయిన జిగ్రా మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ప్రత్యేక అతిథిగా సమంత విచ్చేసారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమె పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
అప్పట్లో ఏ మాయ చేసావే సినిమా ద్వారా సమంత అనే అద్భుత నటి పరిచయం అయ్యారు, ఆమెని ఆ సినిమాని మీరు చూసారా అని అల్లు అర్జున్ తనతో చెప్పారని అన్నారు త్రివిక్రమ్. అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ మాదిరిగా అన్ని భాషల ఆడియన్స్ లో సమంతకు ఎంతో పెద్ద క్రేజ్ ఉందని ఆమెను ఆకాశానికెత్తేశారు త్రివిక్రమ్. మొత్తంగా త్రివిక్రమ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.