కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ GOAT. ఈ మూవీని ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
నిజానికి ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఏవి కూడా ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇక ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తమిళ నాడులో ఈ మూవీని అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇక GOAT మూవీలో విజయ్ తో కలిసి స్టార్ హీరోయిన్ త్రిష ఒక స్పెషల్ సాంగ్ లో చిందేయనున్నారని మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే విషయం ఏమిటంటే, తాజాగా దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ, ఈ మూవీలో త్రిష సాంగ్ ఉందని కన్ఫర్మ్ చేసారు. త్వరలో ఈ సాంగ్ రిలీజ్ కానుంది. విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు చేస్తున్నారు. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.