తెలుగు సినిమా పరిశ్రమకు తొలిసారిగా తరుణ్ హీరోగా తరకెక్కిన నీ మనసు నాకు తెలుసు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన త్రిష ఆపైన వరుసుగా అనేక సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. తెలుగు తోపాటు అటు తమిళ స్టార్ హీరోల సరసన కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరుని ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు త్రిష.
అయితే ఆమధ్య కొన్నాళ్ళు ఆమెకి సరైన అవకాశాలు అయితే రాలేదు. ఇక ఇటీవల మళ్ళీ త్రిషకి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మూవీ లియోలో హీరోయిన్ గా నటించారు త్రిష. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవితో వశిష్టత తెరకెక్కిస్తున్న విశ్వంభర మూవీలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు.
అయితే విషయం ఏమిటంటే లేటెస్ట్ గా సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య కెరీర్ 45 మూవీలో త్రిష హీరోయిన్ గా ఎపిక అయ్యారు. ఆ మూవీ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు వైభవంగా జరిగింది. మొత్తంగా స్టార్ హీరోయిన్ గా నాలుగుపదుల వయసులో కూడా మంచి అవకాశాలతో మరింత క్రేజ్ తో దూసుకెళ్తున్నారు త్రిష. మరి ఈ సినిమాలు ఆమెకి ఎంత మేర సక్సెస్ తెచ్చి పెడతాయో తెలియాలి అంటే మరి కొన్నాళ్ల వరకు ఆగాలి.