టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ గా ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ ని అలానే భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు ప్రభాస్. ఇటీవల యువ దర్శకుడు నాగ అశ్విన్ తీసిన కల్కి 2898 ఏడి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన ప్రభాస్, దానితో బాహుబలి 2 అనంతరం రూ. 1000 కోట్ల మార్క్ కలెక్షన్ అందుకోవడం విశేషం.
ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మొత్తంగా ఐదు మూవీస్ ఉన్నాయి. సలార్ 2, కల్కి 2, హను రాఘవపూడి మూవీ, ది రాజా సాబ్, స్పిరిట్. ఇక ఈ మూవీస్ అన్నింటిపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మ్యాటర్ ఏమిటంటే, రానున్న అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ లభించనుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్.
అందుతున్న సమాచారం ప్రకారం ది రాజా సాబ్ మూవీ నుండి టీజర్ తో పాటు హను రాఘవపూడితో ప్రభాస్ చేస్తోంది మూవీ యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్, అలానే స్పిరిట్ మూవీ నుండి కూడా అప్ డేట్ ఉండనుందట. మరి ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పాలి.