పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎంతో బిజీ బిజీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన ఇటీవల నటించిన మూడు సినిమాలు కొంత మేర షూటింగ్ జరుపుకోగా త్వరలో వాటి మిగతా షూట్ ని పూర్తిచేసేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక పవన్ ప్రస్తుతం యువ దర్శకుడు సుజీత్ తో ఓజి, జ్యోతి కృష్ణ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఈ మూడు క్రేజీ ప్రాజక్ట్స్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే వీటిలో ముందుగా మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం కనపడుతోంది. దీనిని 2025 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
విషయం ఏమిటంటే సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా పవన్ ప్రస్తుతం చేస్తోన్న మూడు సినిమాలకు సంబంధించి వరుసగా అప్ డేట్స్ రానున్నట్లు సినీ వర్గాల టాక్. ఓజి నుండి సాంగ్, ఉస్తాద్, వీరమల్లు సినిమాల నుండి స్పెషల్ గ్లింప్స్ లు రిలీజ్ కానున్నాయట.