Homeసినిమా వార్తలుసమంత తాజా చిత్రం యశోద పై ట్రేడ్ వర్గాల ఆసక్తి

సమంత తాజా చిత్రం యశోద పై ట్రేడ్ వర్గాల ఆసక్తి

- Advertisement -

సమంత నటించిన తాజా చిత్రం యశోద ఆమె అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించింది. ఇటీవ‌ల విడుద‌లైన టీజర్ సినిమాకి మంచి పాజిటివ్ బ‌జ్ ఏర్పడేలా చేసింది, టీజ‌ర్‌ చూసిన తర్వాత ట్రేడ్ వర్గాల్లో వచ్చిన స్పందన చూస్తుంటే సినిమా మంచి ప్రి రిలీజ్ బిజినెస్ చేసేలా ఉంది.

యశోద టీజర్ చూస్తుంటే.. సమంత గర్భిణీ స్త్రీగా కనిపిస్తున్నారు. ఆమెకు డాక్టర్ గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు, వచ్చే అవంతరాలు చెబుతూ ఉంటే అందుకు చాలా రేట్ల ప్రమాదకరమైన పరిస్థితులను సమంత ఎదురుకున్నట్లు చూపించారు. గుర్తు తెలియని వ్యక్తులు మరియు అగంతకుల నుండి సమంతకు అపాయం పొంచి ఉండడం వాటిని ఆమె తీవ్రమైన మానసిక, శారీరక సంఘర్షణ ద్వారా పోరాడినట్లు చూపించటం జరిగింది.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను దర్శక ద్వయం హరి, హరీష్ లు భాధ్యత వహిస్తున్నారు. యశోద సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు ఉన్ని ముకుందన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

READ  2023 Pongal: తమిళ నాట ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య భారీ పోరు

కాగా యశోద చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని, ఇది చాలా కొత్త తరహాలో ఉండే థ్రిల్లర్ అని నిర్మాతలైన శ్రీదేవి మూవీస్ వారు పేర్కొన్నారు, సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడిని ఖచ్చితంగా థ్రిల్ కు గురి చేయడమే కాకుండా వెన్నులో వణుకును పుట్టిస్తుంది అని కూడా అన్నారు. కాగా ఈ చిత్రం లోని స్పెషల్ సీక్వెన్స్‌ల కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరణ పూర్తి చేశారట.

యశోద చిత్రం ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందించబడింది. ఒరిజినల్ వెర్షన్ అయిన తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో కూడా విడుదల కానుంది. టీజర్‌లో సమంత పూర్తిగా కొత్త పాత్రలో కనిపించారు. ముందుగానే చెప్పుకున్నట్లు ఈ సినిమాలో ఆమె పరిస్థితుల నుంచి, కొందరు అగంతకుల నుంచి తనని తాను కాపాడుకునే ఒక గర్భిణీ స్త్రీ పాత్రను పోషిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ప్రిన్స్ సినిమా పై ట్రేడ్ వర్గాలలో తగ్గిన నమ్మకం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories