తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం దర్శకుడుగా మంచి పేరుతో కొనసాగుతున్న వారిలో యువ దర్శకుడు బాబీ కొల్లి కూడా ఒకరు. ఇటీవల బాలకృష్ణతో ఆయన తీసిన డాకు మహారాజ్ మూవీ మంచి విజయవంతమైంది. ఇక త్వరలో తన తదుపరి సినిమా కోసం కథ, కథనాలు సిద్ధం చేసుకున్నారు బాబీ. తొలిసారిగా రవితేజ తో తీసిన పవర్ సినిమా ద్వారా ఆయన టాలీవుడ్ కి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు.
ఆ మూవీతో మంచి విజయం అందుకున్న బాబీ, ఆపైన మంచి సక్సెస్ లతో కొనసాగుతున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం బాబీ త్వరలో చిరంజీవితో ఒక సినిమాతో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో మరొక సినిమా చేయనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇటీవల ముంబైలో హృతిక్ ని ప్రత్యేకంగా కలిసిన బాబీ ఆయనకు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించారని అది ఎంతో నచ్చిన హృతిక్, తన తాజా కమిట్మెంట్స్ అనంతరం చేయడానికి గోపికి గ్రీన్ సెగ్నల్ ఇచ్చారని అంటున్నారు. కాగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయని తెలుస్తోంది. మరి ఇదేగనక నిజమైతే బాలీవుడ్ గ్రీక్ గాడ్ తో బాబీ కొల్లి ఎటువంటి మూవీ తీస్తారో చూడాలి.