టాలీవుడ్ లోని అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ తీసిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ శ్రీమంతుడు ద్వారా చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
అక్కడి నుండి టాలీవుడ్ లోని పలువురు అగ్ర నటులతో సినిమాలు నిర్మించి అనేక భారీ విజయాలతో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. ఇక తాజాగా ఈ సంస్థ అటు బాలీవుడ్ తో పాటు ఇటు కోలీవుడ్ లో కూడా తమ నిర్మాణ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ తో గోపీచంద్ మలినేని తీస్తున్న జాట్ మూవీని వారు నిర్మిస్తున్నారు. ఇక కోలీవుడ్ లో అగ్ర నటుడు అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ తీస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లి మూవీ కూడా నిర్మిస్తున్నారు.
త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ రెండు మూవీస్ పై అందరిలో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. వీటితో పాటు మరోవైపు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో లోకేష్ కనకరాజ్ తీయనున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటు సల్మాన్ తో ఒక మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో వీటికి సంబంధించి అఫీషియల్ ప్రకటనలు కూడా రానున్నాయి.