టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గత జనరేషన్ నటుల్లో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని స్టార్డం తో పాటు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అలానే ఇండస్ట్రీ హిట్స్ తో కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ గా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఆయన అనంతరం అనేకమంది అప్పటి యువ నటులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
కాగా వారిలో కొందరు పెద్దగా సక్సెస్ కాలేదు, మరికొందరు మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక మెగాస్టార్ తరువాత వచ్చిన స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఒక్కో సినిమాతో ఆడియన్స్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ని అందుకుని దూసుకెళ్ళసాగారు. నిజానికి ఇప్పటికీ కూడా వీరిద్దరిలో ఎవరు టాప్ అని అంటే చెప్పడం కష్టం.
ఎందుకంటే ఇద్దరికీ సమానమైన కల్ట్ క్రేజ్ ఉంది. అయితే హిట్స్ మరియు ఇతర బ్లాక్ బస్టర్ రికార్డ్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత ముందంజలో ఉన్నారని చెప్పాలి. అలానే ఇద్దరికీ సునామి రేంజ్ ఓపెనింగ్స్ లభించినప్పటికీ ఫ్లాప్ మూవీస్ తో కూడా రూ. 100 కోట్ల షేర్ రాబట్టగల సత్తాతో మాస్, క్లాస్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ఆడియన్స్ లో క్రేజ్ తో మరింతగా దూసుకెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్.
ఇక ఇటీవల వీరిద్దరి సినిమాలు రీ రిలీజ్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. మహేష్ బాబు పోకిరి, బిజినెస్ మ్యాన్, మురారి వంటి సినిమాలు అదరగొట్టగా, మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, ఖుషి, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కూడా అదరగోట్టాయి. అయితే ఆ స్థాయిలో ఇతర హీరోల సినిమాలకు అంతగా రీరిలీజెస్ లో క్రేజ్ దక్కలేదు. ఆ విధంగా అటు మహేష్, ఇటు పవన్ ఇద్దరూ కూడా టాలీవుడ్ ఎలైట్ హీరోస్ అని చెప్పకతప్పదు.