టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుని ప్రస్తుతం ఇంకా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది.
ముఖ్యంగా మొదటి వారంలోనే ఈ మూవీ రూ. 300 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఫస్ట్ డే ఒకింత మిక్స్డ్ టాక్ లభించినప్పటికీ దేవరకు మాస్, ఫామిలీ ఆడియన్స్ నుండి మంచి ఆదరణ లభిస్తోంది. కాగా టాలీవుడ్ లో ఫస్ట్ వీక్ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమాల్లో బాహుబలి 2 మూవీ టాప్ స్థానంలో నిలిచి రూ. 825 కోట్లని సొంతం చేసుకుంది. అనంతరం ఆర్ఆర్ఆర్ మూవీ రూ. 700 కోట్లు కొల్లగొట్టింది.
వీటి అనంతరం ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ రూ. 630 కోట్లు, సలార్ రూ. 460 కోట్లు, సాహో రూ. 337 కోట్లు, ఇక వీటి అనంతరం మొత్తంగా దేవర మూవీ మొదటి వారంలో రూ. 328 కోట్లు రాబట్టింది. చివరిగా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రూ. 315 కోట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ఈ లిస్ట్ ని పరిశీలిస్తే దాదాపుగా అన్ని కూడా రాజమౌళి, ప్రభాస్ సినిమాలే ఉండడం విశేషం. మరి టాలీవుడ్ నుండి రాబోయే సినిమాల్లో ఏది ఈ లిస్ట్ లో చేరుతుందో చూడాలి.