Homeబాక్సాఫీస్ వార్తలుగాడ్ ఫాదర్ - ది ఘోస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్

గాడ్ ఫాదర్ – ది ఘోస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్

- Advertisement -

ఈ ద‌స‌రా పండ‌గకి తెలుగు సినీ ప్రేక్షకులకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ దక్కబోతుంది. టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఇద్దరూ ఈసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా మొదటగా దసరా పండుగకు సినిమాను విడుదల చేస్తామని చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌` చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అంతే కాక ఈ సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ నయనతార ఒక ముఖ్య పాత్ర పోషించారు. బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇతర ముఖ్య పాత్రలను సత్యదేవ్, పూరీ జ‌గ‌న్నాథ్‌, సునీల్, మురళి శర్మ తదితరులు పోషించారు. మలయాళంలో మోహన్ లాల్ నటించగా సూప‌ర్ హిట్ అయిన `లూసిఫర్` సినిమాకు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల కాబోతోంది.

మ‌రో వైపు నాగార్జున `ది ఘోస్ట్‌` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నారు. ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టించారు. బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్రన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమా సైతం అక్టోబ‌ర్ 5వ తేదీనే రిలీజ్ కాబోతోంది.

READ  పవన్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఖుషి రీ రిలీజ్

పండగ సీజన్ అంటే ఒకటికి రెండు సినిమాలు పోటీ పడడం సహజం. ఇక మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జున ఒకరంటే ఒకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటారు. కాగా ఇద్దరు కూడా తమ సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఒకరికి ఒకరు అల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. మరి ఇద్దరు అగ్ర హీరోలు పోటీ పడుతున్నప్పుడు ఒకరి సినిమాకి ఒకరు నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది కదా.. మరి ఈ రెండు సినిమాల బిజినెస్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తొలుత గాడ్ ఫాదర్ సినిమాని భారీ రేట్లకు అమ్మాలని చూసినా మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. చాలా ఏరియాలలో ఈ చిత్రాన్ని స్వంతంగా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాక చాలా ప్రాంతాలలో బిజినెస్ తాలూకు రేషియోను సవరించడం విశేషం. ఇక నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా కొన్ని ప్రాంతాలలో ఓన్ రిలీజ్ చేస్తూ మరి కొన్ని ప్రాంతాలలో ఇతర పార్టీలకు సరసమైన ధరలకు అమ్మడం జరిగింది.

READ  బ్లాక్ బస్టర్ అని వినిపిస్తున్న గాడ్ ఫాదర్ సెన్సార్ రిపోర్ట్

ఇక బెల్లంకొండ గణేష్, వర్ష బోల్లమ్మ జంటగా నటిస్తున్న స్వాతి ముత్యం సినిమాని ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన సితార బ్యానర్ తో రెగ్యులర్ గా బిజినెస్ చేసేవారు కొనుగోలు చేశారు.

మొత్తంగా గాడ్ ఫాదర్ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే – 80 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అలానే ది ఘోస్ట్ సినిమా 20 కోట్లు సంపాదించాలి. ఇంక చిన్న సినిమా అయిన స్వాతి ముత్యం 4 కోట్ల షేర్ ను దాటితే హిట్ అనిపించుకుంటుంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories