సినీ కార్మికులకి తెలుగు సినిమా పరిశ్రమకి మధ్య కొత్త సమస్య వచ్చి పడింది. దీనికి కారణం సినీ కార్మికుల వేతనల సవరణను తెలుగు సినీ పరిశ్రమ పట్టించుకోకపోవడం ఏ అని తెలుస్తుంది.సినిమా కార్మికులతో వేతన సవరణ ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నా ఫిల్మ్ ఛాంబర్ ఆ పని చేయలేదు. ఇక తెలుగు నిర్మాత మండలి, ఫెడరేషన్ సూచనలు కానీ సలహాలు కానీ ఏమాత్రం పట్టించుకొలేదు అని కార్మికుల ఆరోపణ.
గతంలో తమతో చేసుకున్న ఒప్పందాలు ఏవీ అమలు చేయని కారణంగా ఫెడరేషన్ నేతల మాటలను గౌరవించబోయేది లేదని ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్మాతల మండలి తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ఇటు ఫిల్మ్ ఛాంబర్, అటు నిర్మాతల మండలి మరియు కార్మికుల ఫెడరేషన్ మధ్య కార్మికులు నలిగిపోతున్నారు అనే చెప్పాలి. ఇక ఇలాగే పరిస్థితి కొనసాగితే ప్రమాదం అని, ఫెడరేషన్ పై ఒత్తిడి తీసుకురావాలంటే సమ్మె చేయడమే మార్గమని ఇరవై నాలుగు యూనియన్ ల కార్మికులు నిర్ణయించినట్టు తెలుస్తుంది.
ఈ మేరకు రేపు ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి 24 యూనియన్ సభ్యుల పిలుపునిచ్చారు. రేపటి నుంచి వేతనాలు పెంచే వరకూ 24 క్రాఫ్ట్స్ కి చెందిన వర్కర్లు షూటింగ్ కు హాజరు కాకూడదు అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ వివాదం వీలయినంత త్వరగా పరిష్కారం కాకపోతే షూటింగ్ లు అన్నీ ఎక్కడిక్కడ ఆగిపోక తప్పదు. మరి ఈ సమస్యని ఎంత తొందరగా పరిష్కరించుకుంటుందో చూడాలి.
ఏదేమైనా అసలే సినిమాలు సరిగా ఆడక ఇబ్బంది పడుతున్న పరిశ్రమకు ఇది మరో తలనొప్పిగా మారకుండా సంబంధించిన యూనియన్ లు, నిర్మాత మండలి, ఫెడరేషన్ లేదా మా అసోసియేషన్ వారు అయినా కలగజేసుకుంటే మంచిది.