టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఈ ఏడాది ఇప్పటివరకు కొనసాగిన మూడు నెలలు అనగా మొదటి క్వార్ట్రర్ లో పలు సినిమాలు విజయవంతం అవగా మరికొన్ని పరాజయం పాలయ్యాయి. ఆ విధంగా ఈ మూడు నెలల యొక్క రిలీజ్ ల ద్వారా టాలీవుడ్ లో మిశ్రమ రిపోర్ట్స్ దక్కాయి. కాగా ఇప్పటివరకు మొత్తంగా ఏ ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాటి యొక్క ఫలితాలు ఏమిటనేది ఇప్పుడు లిస్ట్ ప్రకారం చూద్దాం.
- గేమ్ ఛేంజర్ – డిజాస్టర్
- డాకు మహారాజ్ – హిట్
- సంక్రాంతికి వస్తున్నాం – సెన్సేషనల్ బ్లాక్ బస్టర్
- గాంధీ తాట చెట్టు – డిజాస్టర్
- మధ గజ రాజా – డిజాస్టర్
- విడాముయార్చి – డిజాస్టర్
- తండేల్ – సూపర్ హిట్
- బ్రహ్మ ఆనందం – బిలో యావరేజ్
- లైలా – డిజాస్టర్
- జాబిలమ్మ నీకు అంతా కోపమా – డిజాస్టర్
- డ్రాగన్ – బ్లాక్ బస్టర్
- శబ్దం – డిజాస్టర్
- బాపు – డిజాస్టర్
- ఛావా – బ్లాక్ బస్టర్
- కోర్ట్ – బ్లాక్ బస్టర్
- దిల్రుబా – డిజాస్టర్
- మజాకా – డిజాస్టర్
- పెళ్లి కాని ప్రసాద్ – డిజాస్టర్
- మ్యాడ్ స్క్వేర్ – బ్లాక్ బస్టర్
- ఎంపురాన్: డిజాస్టర్
- వీర ధీర శూరన్ – డిజాస్టర్
వీటి ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవగా డాకు మహారాజ్ హిట్ కొట్టింది. అలానే సంక్రాంతికి వస్తున్నాం మూవీ అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక రీ రిలీజ్ ల విషయం చూసుకుంటే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ల ఒకప్పటి సూపర్ హిట్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అనంతరం కూడా సూపర్ గా కలెక్షన్ అందుకుని బ్లాక్ బస్టర్ గానిలిచింది. అలానే ప్రభాస్ నటించిన సలార్ కూడా ఇటీవల రీ రిలీజ్ లో అద్భుతంగా రాబట్టి హిట్ కొట్టింది.
ఇక త్వరలో రానున్న పెద్ద సినిమాల్లో పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు మూవీ మే 9 న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అలానే తమన్నా ఓదెల 2, కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, సూర్య రెట్రో, కమల్ హాసన్ థగ్ లైఫ్, నాని హిట్ 3, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ వంటివి త్వరలో రిలీజ్ అనంతరం ఎంత మేర విజయం అందుకుంటాయో చూడాలి.