Homeసినిమా వార్తలుస్టార్స్​ అనౌన్స్ మెంట్స్ తో ఏప్రిల్ లో టాలీవుడ్ పండుగ  

స్టార్స్​ అనౌన్స్ మెంట్స్ తో ఏప్రిల్ లో టాలీవుడ్ పండుగ  

- Advertisement -

టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఈ ఏడాది సంక్రాంతి నుండి మంచి జోరు మీదుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ అతి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టగా డాకు మహారాజ్ బాగానే ఆడింది. ఇక ఇటీవల వచ్చిన తండేల్ హిట్ కాగా కోర్ట్ మూవీ అద్భుత విజయం సొంతం చేసుకుంది. తాజాగా రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ కూడా అద్భుతంగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. 

అయితే రానున్న ఏప్రిల్ నెలలో వరుసగా టాలీవుడ్ స్టార్స్ మూవీస్ అనౌన్స్ మెంట్స్ తో పెద్ద పండుగని అందివ్వనుంది. ముఖ్యంగా ఏప్రిల్ 6న పెద్ది గ్లింప్స్ తో పాటు ది రాజా సాబ్ నుండి కూడా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ మూవీ యొక్క గ్లింప్స్ వర్క్ మొదలైందని తెలుస్తోంది. 

అలానే సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి ల పాన్ వరల్డ్ మూవీ SSMB 29 కిస్ సంబందించిన అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ కూడా ఇదే నెలలో ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం, ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అవ్వనున్నారు. హరి హర వీర మల్లు మూవీ యొక్క ట్రైలర్ ఈ నెలాఖరులో రానుంది. 

READ  Finally Akhil Agent Streaming in OTT ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 'ఏజెంట్'

ఇక వీటితో పాటు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ తో పాటు త్రివిక్రమ్ మూవీ గురించిన అప్ డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మెగాస్టార్ విశ్వంభర మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ డేట్ కూడా ఇదే నెలలో రానుందని తెలుస్తోంది. మొత్తంగా టాలీవుడ్ ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ఏప్రిల్ లో మంచి పండుగే ఉండనుంది. 

Follow on Google News Follow on Whatsapp

READ  Arjun Son of Vyjayanthi Business Details 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' బిజినెస్ డీటెయిల్స్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories