టాలీవుడ్ సినిమా ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఒక్కో సినిమాతో అంతకంతకు ముందుకు దూసుకెళుతోంది. ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం ఎస్ ఎస్ రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ లోని రెండు పాన్ ఇండియన్ సినిమాల గురించి తెలిసిందే.
అవి రెండు కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి ఎంతో పెద్ద విజయాలు అందుకున్నాయో ఏస్థాయిలో వందల కోట్లు కొల్లగొట్టాయో కూడా తెలుసు. ఇక అక్కడి నుండి సౌత్ మొత్తం కూడా పాన్ ఇండియన్ మూవీ రాక పెరిగింది. ఇక తాజగా తెలుగులో గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రిలీజ్ అయిన పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1 ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ తో కొనసాగుతోంది.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీని కొరటాల శివ రూపొందించారు. కాగా ఇప్పటికే ఈ మూవీ రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. విషయం ఏమిటంటే, ఫస్ట్ వీకెండ్ లో టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో దేవర పార్ట్ 1 మూవీ 7వ స్థానంలో నిలిచింది. కాగా టాలీవుడ్ ఫస్ట్ వీకెండ్ టాప్ గ్రాసింగ్ మూవీ డీటెయిల్స్ క్రింద ఇవ్వడం జరిగింది.
బాహుబలి – రూ. 2: 510 కోట్లు (3 రోజులు)
ఆర్ఆర్ఆర్ – రూ. 495 కోట్లు (3 రోజులు)
కల్కి 2898 AD – రూ. 494 కోట్లు (4 రోజులు)
సలార్ – రూ. 310 కోట్లు (3 రోజులు)
ఆదిపురుష్ – రూ. 271 కోట్లు (3 రోజులు)
సాహో – రూ. 255 కోట్లు (3 రోజులు)
దేవర – రూ. 250 కోట్లు (3 రోజులు)
కాగా ఈ లిస్ట్ లో కేవలం రాజమౌళి, ప్రభాస్ ల సినిమాలు నిలవగా తాజాగా ఎన్టీఆర్ దేవర కూడా నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఓవరాల్ గా దేవర ఎంతమేర రాబడుతుందో చూడాలి.