టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB 29. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు చేస్తుండగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
వి విజయేంద్రప్రసాద్ కథని అందిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే మహేష్ బాబు పూర్తిగా క్రాఫ్, గడ్డంతో పాటు బల్క్ గా బాడీని కూడా పెంచుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని తన కెరీర్లో ఆయన ఇప్పటివరకు పోషించని ఒక డిఫరెంట్ పాత్రలో ఇందులో కనిపిస్తారని చెప్తున్నారు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అందుకున్న అనంతరం గ్లోబల్ గా భారీ ఇమేజ్ అందుకున్న రాజమౌళి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న SSMB29 సినిమా 2027 సమ్మర్లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్.
అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ అప్ డేట్ ని మార్చి 30న అనగా ఉగాది పండుగ నాడు అందిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ నెలలోనే అనగా ఏప్రిల్ లో SSMB29 కి సంబంధించి అనౌన్స్మెంట్ గ్లింప్స్ తో పాటు టైటిల్ కూడా రివీల్ కానుందని దానికి సంబంధించి త్వరలో టీం నుంచి ఒక ప్రకారం కూడా వెలువడనుందని చెప్తున్నారు. మరి అదే గనక నిజమైతే ఏప్రిల్ నెలలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ ఖాయమని చెప్పాలి