తెలుగు సినిమా పరిశ్రమలో యువ నటుడిగా మంచి విజయాలతో జోరు మీద కొనసాగుతున్న వారు సిద్దు జొన్నలగడ్డ. ఇటీవల డీజే టిల్లు సినిమాలో తన మార్క్ ఎంటర్టైనింగ్ యాక్టింగ్ స్టైల్ తో యువతలో విశేషమైన క్రేజ్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత గత తేడాది దానికి సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు.
ఈ సినిమా మరింత భారీ విజయముందుకుని ఓవరాల్ గా రూ. 120 కోట్ల వరకు గ్రాస్ అయితే సొంతం చేసుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ఇక త్వరలో ఈ సినిమా యొక్క మూడో భాగం అయిన టిల్లు క్యూబ్ రూపొందనుందని ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఈ సినిమాని మరింత గ్రాండియర్ గా రూపొందించనున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం పలు ప్రాజెక్టుతో సిద్దు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు మ్యాడ్ స్క్వేర్ మూవీతో బిజీగా ఉన్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ టిల్లో క్యూబ్ కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ నైతే పూర్తి చేశానని త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
తప్పకుండా రెండు పార్టులని మించి ఈ మూడో పార్ట్ మరింత ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని యువతని విశేషంగా ఆకట్టుకుంటుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. కాగా ఈ సినిమా పక్కాగా 2026 లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి పక్కాగా టిల్లు క్యూబ్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.