Home సినిమా వార్తలు Thunivu OTT: అజిత్ లేటెస్ట్ హిట్ తునివు ఓటీటీలో విడుదలయ్యే రోజు అదే

Thunivu OTT: అజిత్ లేటెస్ట్ హిట్ తునివు ఓటీటీలో విడుదలయ్యే రోజు అదే

అజిత్ తాజా హిట్ సినిమా తునివు ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. గత నెలలో థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీ ప్రీమియర్ గా అడుగు పెడుతోంది.

తునివు ఓటీటీ ప్రీమియర్ ఫిబ్రవరి 8న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన తునివు చిత్రం విజయ్ వారిసుతో పాటు విడుదలై ROI ప్రకారం తమిళ నాట పొంగల్ విజేతగా నిలిచింది.

వారిసు, తునివు చిత్రాలు మిశ్రమ సమీక్షలు అందుకున్నప్పటికీ అజిత్, విజయ్ ల స్టార్ పవర్, పొంగల్ సీజన్ కారణంగా తర్వాతి రోజులలో కూడా వసూళ్లు తెచ్చుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఓవరాల్ గా చూసుకుంటే తునివు కంటే వారిసుకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. కానీ, సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.

సముద్రఖని, మంజు వారియర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నిజానికి తొలి రోజు మిశ్రమ సమీక్షలను అందుకుంది, అయితే అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు హెచ్ వినోద్ యొక్క తనదైన కథనం ఈ సినిమాను మంచి ఆరంభాన్ని తీసుకురాగలిగాయి.

తునివు అజిత్ కు కెరీర్ బెస్ట్ ఫస్ట్ వీక్ నంబర్లను అందించింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారంలో తమిళనాడులో 90 కోట్లు కలెక్ట్ చేయగా, దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ మొదటి వారం తర్వాత 110 కోట్లకు దగ్గరగా ఉన్నాయి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version