Homeబాక్సాఫీస్ వార్తలుకేరళలో సంచలన రికార్డు సృష్టించిన 'తుడరుమ్' 

కేరళలో సంచలన రికార్డు సృష్టించిన ‘తుడరుమ్’ 

- Advertisement -

మలయాళ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం మంచి విజయాలతో కెరీర్ పరంగా బాగా క్రేజ్ తో దూసుకెళుతున్నారు. తాజాగా ఆయన హీరోగా శోభన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తుడరుమ్. యువ దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈ సినిమా అందరి నుంచి సూపర్ గా రెస్పాన్స్ సంపాదించుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయడంకా మోగిస్తూ భారీ కలెక్షన్స్ తో కొనసాగుతోంది.

ఇటు తెలుగులో కూడా ఈ సినిమాకి బాగానే కలెక్షన్స్ లభిస్తున్నాయి. ఇప్పటికే తుడరుమ్ మూవీ ఓవరాల్ గా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ తో కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా కేరళలో ఒక అద్భుతమైన రికార్డు నెలకొల్పింది. కేవలం కేరళ రాష్ట్రంలో ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టిన తొలి మలయాళ మూవీగా నిలిచింది.

వాస్తవానికి ఈ విధముగా ఒక స్టేట్ లో అత్యధిక  రూ.100 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న సినిమాలుగా తమిళనాడులో రోబో 2017లో ఆంధ్ర ప్రదేశ్ లో బాహుబలి 2017 లో తెలంగాణలో బాహుబలి 2 2017లో అలానే కర్ణాటకలో కూడా బాహుబలి 2017 లో ఇక తాజాగా కేరళలో తుడరుమ్ 2025లో ప్రభంజనాలు సృష్టించాయి. మరి ప్రస్తుతం ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో మంచి కలెక్షన్ తోనే కొనసాగుతూ ఉండటంతో ఓవరాల్ గా ఇది ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

READ  తుడరమ్ : ఒక తప్పుడు నిర్ణయంతో కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన మేకర్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories