Homeసినిమా వార్తలు'పెద్ది' టీజర్ లో హైలైట్స్ అవేనట

‘పెద్ది’ టీజర్ లో హైలైట్స్ అవేనట

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా మూవీ పెద్ది. ఈ మూవీలో రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా బాలీవుడ్ అందాల కథానాయిక జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. 

మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. వ్రిద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న పెద్ది నుండి ఇటీవల రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 4న తమ మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. అదే రోజున పెద్ద మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు టాక్. విషయం ఏమిటంటే ​టీజర్ అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. 

READ  Telugu Historical Biopics being Failed ఫెయిల్ అవుతున్న తెలుగు హిస్టారికల్ బయోపిక్స్ 

ముఖ్యంగా ఈ టీజర్ లో రామ్ చరణ్ లుక్స్ తో పాటు రాయలసీమ యాసలో ఆయన పలికే డైలాగ్స్ అదిరిపోవడంతో పాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయని అంటున్నారు. మొత్తంగా ఏప్రిల్ 6 న ఆడియన్స్ ముందుకి రానున్న పెద్ది గ్లింప్స్ తో మూవీ పై అంచనాలు అమాంతం పెరగడం ఖాయం అని తెలుస్తోంది. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories