ఈ వారం కొన్ని ఆసక్తికరమైన సినిమాలు OTT విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు ప్రతి వారం OTT విడుదలల కోసం వేచి ఉండటం ఆనవాయితీగా మారింది. సాధారణ వెబ్ సిరీస్‌లు మరియు ప్రత్యేకంగా OTTలో విడుదల అయ్యే వాటితో పాటు OTTకి థియేట్రికల్ విడుదలలు కూడా చాలా తొందరగా వచ్చేస్తున్నాయి.
ఈ వారం తెలుగు OTT విడుదలలలో మెగాస్టార్ యొక్క పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ మరియు కార్తి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సర్దార్ ఉన్నాయి. వాటితో పాటు కొన్ని సినిమాలు నేరుగా విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 19న గాడ్‌ఫాదర్‌ను విడుదల చేయనుండగా, సర్దార్ నవంబర్ 18న ఆహాలో విడుదల కానుంది. ఇక ఇతర విడుదలలు చూసుకుంటే రాజ్ తరుణ్ యొక్క అహ నా పెళ్లంట నవంబర్ 17న Zee5 లో ప్రసారం చేయబడుతుంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 8 ఎపిసోడ్ సిరీస్ ప్రేక్షకులకి నచ్చుతుంది అని అంచనా వేస్తున్నారు. ఇక ఐరావతం అనే కొత్త సినిమా నవంబర్ 17 నుండి డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం చేయబడుతుంది. కాగా ఇది ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన చిత్రం.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌కి మంచి రివ్యూలు వచ్చినా మంచి కలెక్షన్స్ మాత్రం అనున్న స్థాయిలో రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా పూర్తిగా గ్రిప్పింగ్ డ్రామాతో కూడుకున్నందున OTT ప్లాట్‌ఫారమ్ లో మంచి స్పందన వస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.
మరో వైపు కార్తీ సర్దార్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మిస్ అవకూడని చిత్రం అని చెప్పాలి. థియేటర్‌లలో ఈ సినిమా చూడని వారు కార్తీ మరియు దర్శకుడు మిత్రన్‌ల నుండి వచ్చిన ఈ అద్భుతమైన స్పై థ్రిల్లర్‌ని చూసి ఆస్వాదించవచ్చు.
విడుదలైన 4 వారాల్లోనే OTT విడుదల కావడం వివాదం సృష్టిస్తుంది. ఓటీటీలో సినిమాను విడుదల చేయాలంటే కనీసం 6 వారాల గ్యాప్ తప్పదని నిర్మాతల మండలి ఇప్పటికే తీర్పునిచ్చింది. సర్దార్ విడుదలై నెల కూడా కాలేదు అయినా OTT లో వచ్చేస్తుంది. ఇక గాడ్ ఫాదర్ మాత్రం థియేటర్ నుండి OTT విడుదలకు సరిగ్గా 42 రోజుల గ్యాప్ తీసుకుంది.