Homeసినిమా వార్తలుAdipurush: ప్రభాస్ ఆదిపురుష్ టీంకు చాలా కీలకంగా మారిన రాబోయే శ్రీరామనవమి

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ టీంకు చాలా కీలకంగా మారిన రాబోయే శ్రీరామనవమి

- Advertisement -

ప్రభాస్ ‘ఆదిపురుష్’ విడుదల తేదీగా జూన్ 16ను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉన్నప్పటికీ చిత్ర బృందం ఎలాంటి అప్డేట్స్ కానీ, ప్రమోషన్ కార్యక్రమాలు కానీ చేపట్టకుండా మౌనం పాటిస్తోంది.

ఇక ఇటీవలి కాలంలో ఈ సినిమా యొక్క విఎఫ్ఎక్స్ పనులతో చిత్ర బృందం సంతృప్తి చెందకపోవడంతో ఈ సినిమాను మరో తేదీకి వాయిదా వేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కుతుండటంతో రాబోయే శ్రీరామనవమి పండుగ టీమ్ కు చాలా కీలకం కానుంది. పండుగ సందర్భంగా ప్రేక్షకులు, అభిమానులు సినిమా నుంచి ఒక భారీ అప్ డేట్ ఆశిస్తున్నారు.

సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ చేయడానికి నిర్మాతలు పక్కాగా ప్రమోషనల్ కంటెంట్ తో ముందుకు రావాల్సి ఉందని, అలా చేయడం వల్ల కొత్త పోస్టర్ లేదా వీడియోతో రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేస్తే అందరికీ బాగుంటుంది అని అంటున్నారు.

READ  Saif Ali Khan: ఎన్టీఆర్ 30 లో విలన్ గా సైఫ్ అలీఖాన్

వీఎఫ్ఎక్స్ పనులలో మార్పుల కారణంగా ఆదిపురుష్ సినిమా బడ్జెట్, ప్రొడక్షన్ టైమ్ గణనీయంగా పెరగడంతో ఓం రౌత్ అండ్ టీమ్ పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. వీఎఫ్ఎక్స్ రిజల్ట్ ఎలా ఉంటుందోనని ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతుండగా, ఆదిపురుష్ సినిమా రిజల్ట్ పై కూడా వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తుండగా జానకి పాత్రలో కృతి సనన్, లంకేష్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories