Homeసినిమా వార్తలుది వారియర్: భారీ స్ధాయిలో జరగనున్న తమిళ ప్రి రిలీజ్ ఈవెంట్

ది వారియర్: భారీ స్ధాయిలో జరగనున్న తమిళ ప్రి రిలీజ్ ఈవెంట్

- Advertisement -

ఎనర్జెటిక్ హీరో రామ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా `ది వారియర్`. యాక్షన్ ను హ్యాండిల్ చేయడంలో తనదైన శైలి ఉన్న దర్శకుడు ఎన్.లింగుస్వామి ఈ సినిమాన ఓకే సారి తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ఫస్ట్ లుక్, టీజర్ ,ట్రైలర్ ఇలా పబ్లిసిటీ మెటీరియల్ అన్నీ బాగుండి సినిమాపై అంచనాల్ని పెంచేసాయి. పవర్ ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. యువ నటుల్లో మంచి పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న ఆది పినిశెట్టి ఇందులో విలన్ గా చేయనున్నారు.

ముందుగానే చెప్పుకున్నట్టు ఈ సినిమాలో ఇదివరకే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా “బుల్లెట్టు” పాట సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.యూట్యూబ్ లో వ్యూస్ మరియు ఇన్స్టా లో రీల్స్ వరకు ఈ పాట తెగ వైరల్ అయింది. పాటలో రామ్ డాన్స్ ఎప్పటిలాగే ఆకట్టుకోగా.. కృతి శెట్టి కూడా ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులు అదరగొట్టింది.ఇక ఆ పైన విడుదలైన దడ దడ, విజిల్ పాటలు కూడా ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాబట్టుకున్నాయి.మరో పాట కలర్స్ రేపు విడుదల అవబోతుంది.

మరో పది రోజుల్లో సినిమా రిలీజ్ కానుండడంతో,చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే హీరో రామ్ మీడియా వారికి ఇంటర్వ్యూలు ఇస్తుండగా రేపు ఈ సినిమా తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చెన్నై లోని సత్యం సినిమాస్ లో సాయంత్రం 6 గం. 30 ని. ల నుండి జరుగనున్నట్లు కొద్దిసేపటి క్రితం చిత్ర బృందం అదికారికంగా ప్రకటించింది.అలాగే త్వరలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపనున్నట్లు తెలుస్తోంది. మరి జులై 14న భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ది వారియర్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

READ  నరేష్ - పవిత్ర సంబంధం వ్యవహారంలో మళ్ళీ గందరగోళం

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories