Homeసినిమా వార్తలుది వారియర్ టీమ్ తప్పు చేస్తుందా?

ది వారియర్ టీమ్ తప్పు చేస్తుందా?

- Advertisement -

కరోనా తర్వాత ప్రేక్షకులు చాలా మారిపోయారు. వాళ్లను థియేటర్ల వద్దకు రప్పించాలి అంటే సినిమా వాళ్ళు ఏదైనా అద్భుతం చేయాలి. అది చేయడంలో చాలా మటుకు విఫలం అవుతున్నారు మన దర్శకులు, నిర్మాతలు. తెలుగు ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా పెరిగిన టికెట్ రేట్ల గురించి జరిగిన చర్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు అడ్డూ అదుపూ లేకుండా టికెట్ రేట్లు పెంచారంటూ చిత్ర సీమ పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. టికెట్ రేట్లు పెంచినప్పటికీ ఆ సినిమాల ఫలితాలు దారుణంగా రావడంతో, నిజంగానే టికెట్ రేట్లు పెరగడం వల్లే ప్రేక్షకులు థియేటర్ల వద్దకు రావడం లేదు అని అందరూ అనుకున్నారు.

కానీ అందులో ఎలాంటి నిజం లేదని.. టికెట్ రేట్ల ప్రభావం కొంత ఉన్నా, సరైన కంటెంట్ లేని సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదనే విషయం గత కొన్ని రోజులుగా వస్తున్న సినిమాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది.

దానికి ఉదాహరణగా ఇటీవల విడుదలైన సినిమాల ఫలితాలు చూస్తే .. జూన్ లో విడుదలైన మేజర్, విక్రమ్ చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేశాయి, సినిమాతో ముడిపడ్డ అన్ని వర్గాల వారికీ లాభాలు తెచ్చి పెట్టాయి. అయితే గమనించాల్సిన ఏంటంటే మేజర్ సినిమాకి టికెట్ రేట్లు తగ్గించగా, విక్రమ్ చిత్రానికి మాత్రం జీవో (సింగిల్ స్క్రీన్ – 175 మల్టీప్లెక్స్ – 295) రేట్లు అమలు చేశారు.

READ  Editor Gowtham Raju Passed away: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత

ఇక తరువాత విడుదలైన అంటే సుందరానికీ, విరాట పర్వం సినిమాలు మాత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి. ఆ రెండు సినిమాలకూ విక్రమ్ కి ఉన్న టికెట్ రేట్లే ఉన్నాయి. అంటే ఇక్కడ సినిమా కంటెంట్ అనేది ప్రేక్షకులను ఆకట్టుకుంటే టికెట్ రేట్లతో పని లేదు.. ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాని ఆదరిస్తారు.సినిమాలో సరైన విషయం లేకుంటే పక్కా కమర్షియల్ లాంటి సినిమాకి టికెట్ రేట్లు తగ్గించ్చినా ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొట్టారు.

ఇక ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా తమ కష్టాలను గట్టేక్కిస్తుంది అని నమ్మకంతో ఉన్న “ది వారియర్” చిత్రం ఈ 14న విడుదల అవుతుంది.ఆ సినిమాకి కూడా సింగిల్ స్క్రీన్ – 175 మల్టీప్లెక్స్ – 295 రేట్లు అమలు చేస్తున్నారని తెలిసింది. ఒక మీడియం బడ్జెట్ సినిమాకి ఇది ఖచ్చితంగా ఎక్కువ రేటు గా చెప్పుకోవచ్చు. ఇది సినిమాకి నెగటివ్ గా పని చేసే అవకాశం ఉందని సినీ ఔత్సాహికులు, ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

READ  777 చార్లీ చిత్రం చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి

ఏదేమైనా ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు ఇలా రేట్లు ఎక్కువ, తక్కువ అంటూ అది ఒక ప్రచార సాధనంగా కాకుండా ఇప్పటికైనా పెద్ద సినిమాలకు ఇంతా, చిన్న సినిమాలకు ఇంతా అని ఒక నిర్ధారిత టికెట్ రేట్లు నిర్ణయించుకుని అవి అన్ని సినిమాలకు అమలు అయ్యేలా చూస్తే అందరికీ మంచిది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories