Home సినిమా వార్తలు Mythri Movie Makers: అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఖరీదైన తప్పిదం

Mythri Movie Makers: అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఖరీదైన తప్పిదం

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అతి పెద్ద బ్యానర్లలో ఒకటి. ఈ బ్యానర్ విజయవంతమైన చిత్రాలను నిర్మించి టాప్ పొజిషన్ ను అందుకోవడమే కాకుండా రానున్న రోజుల్లో వరుస భారీ ప్రాజెక్టులు కూడా వారి చేతిలో ఉన్నాయి. మైత్రీ మూవీస్ విజయానికి ప్రధాన కారణం వారి సినిమాల సక్సెస్ రేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తమ బ్యానర్ లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. చిన్న, స్టార్ హీరోలతో కూడా సినిమాలు తీసి ప్రేక్షకుల్లో మంచి క్రెడిబిలిటీని సంపాదించుకున్నారు. అయితే తమ తాజా చిత్రం మీటర్ తో నిర్మాతలు ఖరీదైన తప్పిదం చేసినట్లుగా కనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం తాజా చిత్రం మీటర్ కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన విషయం అందరికీ తెలిసిందే.

మైత్రీ లాంటి పేరున్న బ్యానర్ మీటర్ లాంటి అర్థం పర్థం లేని చెత్త సినిమాను నిర్మించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మైత్రీ మూవీస్ తమ బ్యానర్ లో సినిమా చేయడానికి కారణాలు, షరతులు ఏమిటో ఎవరికీ తెలియవు కానీ ఈ తరహా కంటెంట్ తో వారి బ్యానర్ లో ఒక సినిమా వస్తుందని ప్రేక్షకులు ఊహించలేదు. ఇలాంటి పొరపాట్లు తమ బ్యానర్ ఇమేజ్ ను దెబ్బతీస్తాయని మైత్రీ టీం గ్రహించాలి.

దిల్ రాజు ఇలాంటి తప్పులు చేయకపోవడం తన బ్యానర్ కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. అమర్ అక్బర్ ఆంటోని, సవ్యసాచి వంటి సినిమాలతో గతంలో మైత్రీ మూవీస్ పరాజయాలను చవిచూసినా.. ఆ సినిమాల ఆలోచనలకు ప్రశంసలు దక్కాయి. భవిష్యత్తులో మీటర్ లాంటి సినిమాలు చేయకుండా ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా మైత్రి టీం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version