Home సినిమా వార్తలు Game Changer: తెలుగులో పోస్టర్‌ని విడుదల చేయనందుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీమ్‌ వల్ల...

Game Changer: తెలుగులో పోస్టర్‌ని విడుదల చేయనందుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీమ్‌ వల్ల నిరాశ చెందిన తెలుగు ప్రేక్షకులు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తదుపరి చిత్రం యొక్క నిర్మాతలు ఈరోజు ఉదయం తమ సినిమాకు టైటిల్ ప్రకటించారు. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి భారతీయ చిత్రసీమలో అతిపెద్ద దర్శకుల్లో ఒకరైన శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్నారు.

టైటిల్ మరియు దాని గ్లింప్స్ మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ, రామ్ చరణ్ అభిమానులు తమ అభిమాన హీరో చిత్రం నుండి ఒక కొత్త అప్డేట్ పొందడంతో సంతోషించారు. కాగా ఈరోజు సాయంత్రం, గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లను నిర్మాతలు రివీల్ చేశారు. అయితే ఈ ప్రకటన చిన్న వివాదానికి దారి తీసింది.

https://twitter.com/SVC_official/status/1640286585148293120?t=OXhmYM_RTpK_nsuvd6ihBg&s=19

తెలుగు భాషలో పోస్టర్‌ను విడుదల చేయనందుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీమ్ పట్ల తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం సంతోషంగా లేరు. తమిళ పోస్టర్‌లో రామ్ చరణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తమిళ భాషలో ఉండగా, తెలుగు పోస్టర్ లో మాత్రం ఇంగ్లీష్ లోనే ఉండటం తెలుగు ప్రేక్షకులకు తీవ్ర నిరాశను గురి చేసింది.

ఇక ఈ వివాదం పక్కనపెడితే పోస్టర్ లో రామ్ చరణ్ బృందం తన అద్భుతమైన మేక్ఓవర్‌తో అందరి మనస్సును కదిలించేలా చేసి ఆశ్చర్యపరిచారు. పోస్టర్‌లో చరణ్ ఇంటెన్స్ లుక్ ఆయన అభిమానులను చాలా సంతోషపరిచింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు చెప్పకనే చెప్పారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు శ్రీకాంత్, అంజలి, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ థమన్, సినిమాటోగ్రఫీ: తిరునావుక్కరసు. గతంలో ‘వినయ విధేయ రామ’ (2019)లో కలిసి పని చేసిన తర్వాత రామ్ చరణ్ మరియు కియారా అద్వానీల మధ్య ‘గేమ్ ఛేంజర్’ రెండవ సినిమా కావడం విశేషం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version