కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన తాజా సంచలన చిత్రం కాంతార. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో రిషబ్ శెట్టి కంబాళ ఛాంపియన్ గా నటించారు, అతను నిజాయితీగల డిఆర్ఎఫ్ఓ అధికారి మురళి (కిషోర్) తో గొడవ పడతాడు. అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ సహాయక పాత్రల్లో నటించారు.
కన్నడ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, ఈ చిత్రం హిందీ వెర్షన్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఈ చిత్రం నేటితో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా రిషబ్ శెట్టి, కాంతార అభిమానులతో పాటు ఈ మైలురాయి చేరుకున్న ఆనందాన్ని పంచుకున్నారు.
రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తన ‘డివైన్-బ్లాక్ బస్టర్’ పోస్టర్లను పంచుకోవడంతో పాటు తన చిత్రం యొక్క అభిమానులందరికీ మరియు చిత్ర నిర్మాతకు, ఈ ఘనత సాధించడానికి సహాయపడిన తారాగణం మరియు సిబ్బందికి కృతజ్ఞతతో నిండిన నోట్ ను పంచుకున్నారు.
ఈ 100 రోజుల ప్రయాణంలో తమకు మద్దతుగా నిలిచి దైవత్వాన్ని కనుగొన్నందుకు ప్రేక్షకులందరికీ రిషబ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంతార సినిమాని వారు ఎప్పటికీ గుర్తుంచుకుంటామని, ఇది మమ్మల్ని తిరిగి మన మూలాలకు తీసుకువెళ్ళి, మన సంప్రదాయాల పట్ల విస్మయం కలిగించిందని ఆయన అన్నారు. దీన్ని సాకారం చేసిన ప్రతి ఒక్కరికీ రిషబ్ అభినందనలు తెలిపారు.
కన్నడలో అతి తక్కువ స్క్రీన్స్ తో విడుదలైన ఈ చిత్రం ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ మరియు టాక్ తో కర్ణాటక బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాకుండా, కెజిఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషలలో డబ్ చేయబడింది మరియు అన్ని భాషలలో సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ నెంబర్లను తెచ్చిపెట్టింది.
రిషబ్ శెట్టి ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకం పై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్ కుమార్ జి కీలక పాత్రల్లో నటించారు.