Homeసినిమా వార్తలుOrange: భారీ విజయంగా నిలిచిన ఆరెంజ్ రీ-రిలీజ్

Orange: భారీ విజయంగా నిలిచిన ఆరెంజ్ రీ-రిలీజ్

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయాలనే నిర్ణయం మొదట్లో సందేహాస్పదంగా ఉండింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాని కాకుండా కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన చరణ్‌ ఇతర చిత్రాలను విడుదల చేయడం మంచిదని పలువురు అభిమానులు కూడా వాదించారు.

ఆరెంజ్‌లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం 2010లో విడుదల అయిన సమయంలో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది మరియు అభిమానులు ఆ సినిమా రీ-రిలీజ్‌లో కూడా అలాంటిదేదో జరుగుతుందని భయపడ్డారు.

అయితే, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, ఈ చిత్రం థియేటర్లలోకి రీ-ఎంట్రీకి స్పందన చాలా అద్భుతంగా వచ్చింది. ఆరెంజ్ రీ రిలీజ్ లో చాలా ప్రాంతాలలో భారీ ఆక్యుపెన్సీలను నమోదు చేసింది మరియు ఎన్నో షోలు హౌస్‌ఫుల్‌గా నమోదయ్యాయి. రీ-రిలీజ్‌ని టీమ్ చాలా బాగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది. మొదట, వారు పరిమిత షోలలో స్క్రీనింగ్‌ను ప్రారంభించారు మరియు డిమాండ్‌ పెరుగుతున్న కొద్దీ, వారు స్రీన్లని షోలను పెంచుకుంటూ పోయారు.

READ  Dasara: నాని దసరా కోసం మిడ్ నైట్ ప్రీమియర్స్ మరియు ఎర్లీ మార్నింగ్ షోలు

రామ్‌చరణ్‌, జెనీలియా జంటగా నటించగా.. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఆరెంజ్‌ సినిమా తెరకెక్కింది. నాగ బాబు నిర్మించిన ఈ చిత్రం మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ తదుపరి విడుదల కావడంతో భారీ అంచనాల మధ్య 2010లో విడుదలైంది. అయితే వివిధ కారణాల వల్ల, ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమైంది మరియు చరణ్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఆరెంజ్ సినిమాకి సంగీతం ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలవగా నేటికీ ఈ చిత్రంలోని పాటలను ఎంతో మంది ఇష్టపడతారు. ఈ రోజుకి కూడా సంగీత ప్రియులయిన ప్రేక్షకులు చాలా మందికి ఇష్టమైన ఆల్బమ్‌గా ఉంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Magadheera: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మగధీర రీ రిలీజ్ ప్లాన్ క్యాన్సిల్ అయినట్లు ఖరారు చేసిన నిర్మాత


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories