Homeసినిమా వార్తలు'ది రాజా సాబ్' : టీజర్ విత్ రిలీజ్ డేట్ లోడింగ్

‘ది రాజా సాబ్’ : టీజర్ విత్ రిలీజ్ డేట్ లోడింగ్

- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ది రాజా సాబ్. ఈ మూవీలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మారుతీ దాసరి తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్, మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. వాస్తవానికి ఏప్రిల్ లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా సినిమాకు సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇతర పలు కార్యక్రమాలు పెండింగ్ ఉండటంతో దీన్ని మరి కొన్నాళ్లపాటు వాయిదా వేశారు. 

అయితే లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్ ప్రకారం ది రాజా సాబ్ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ కానుండగా అప్పుడే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నట్లు చెబుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలిచేటువంటి అవకాశం ఉందని టాక్.

READ  రూ. 200 కోట్ల క్లబ్ లో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories