టాలీవుడ్ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ కామెడీ హారర్ యాక్షన్ మూవీ ది రాజా సాబ్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితమవుతున్న ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అలానే మోస్ట్ మోషన్ పోస్టర్ బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర చేస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో మురళి శర్మ, అనుపమ్ ఖేర్, జరీనా వాహబ్, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం రానున్న క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సందర్భంగా ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు ది రాజా సాబ్ మూవీ నుంచి ఒక స్పెషల్ టీజర్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. దీని పై మేకర్స్ నుండి అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సమ్మర్ కానుక గా 2025 ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.