పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ నుండి నేడు ఆయన బర్త్ డే సందర్భంగా ప్రత్యేక మోషన్ పోస్టర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. హర్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా మారుతీ దీనిని తెరకెక్కిస్తున్నారు.
ఇక నేడు రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ లో ఓల్డ్ లుక్ లో గడ్డంతో చుట్ట కలుస్తూ ఉన్న ప్రభాస్ లుక్ పై ఒకింత షాకింగ్ రెస్పాన్స్ అయితే లభిస్తోంది. ఆరడుగుల ఆజానుబాహుడైన తమ హీరో నుండి ఈ లుక్ అసలు ఊహించలేదనేది కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.
ముఖ్యంగా విఎఫ్ఎక్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఇక మొన్న ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మొత్తంగా అటు పోస్టర్, ఇటు మోషన్ పోస్టర్ రెండూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే కంటెంట్ లో విషయం ఉంటె ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్ కాదని అంటున్నాయి సినీ వర్గాలు. కాగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా అన్ని కార్యక్రమాలు ముగించి ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.