పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్ర చేస్తుండగా యువ అందాల కథానాయికలు రిద్ది కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కాగా లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్నారు చెప్తున్నారు.
మరోవైపు ఇలయదళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్స్ గా హెచ్ వినోద్ తీస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకున్న ఈమూవీ 26 సంక్రాంతి కానుకగా ఆడియన్సు ముందుకి రానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
విజయ్ కెరీర్ ఆఖరి మూవీగా రానున్న జన నాయగన్ ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్చేస్తున్నారు. కాగా ప్రభాస్ ది రాజాసాబ్ కూడా పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఈ రెండూ సంక్రాంతికి వస్తే బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఖాయం అని తెలుస్తోంది. అయితే ది రాజాసాబ్ సంక్రాంతి రిలీజ్ కి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది.