ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ మూవీ కూడా ఒకటి. ఈ హర్రర్ కామెడీ సినిమాని వీలైనంత త్వరలో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే త్వరలో ది రాజా సాబ్ మూవీ యొక్క టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్.
ఇటీవల ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు రఫ్ కట్ చూపించిన దర్శకుడు మారుతి ప్రభాస్ నెవ్వర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసారని చెప్పడంతో హ్యాపీగా ఉన్నారట. ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఓ డైలాగ్ ప్రభాస్ నోటి నుంచి వినిపించబోతోందట.టీజర్ లో డైలాగులు, ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తాయని, ఇప్పటి వరకూ ఇదో హారర్ సినిమా అనుకొన్నారు.
కానీ మారుతి మార్క్ సర్‌ప్రైజింగ్ గా విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. అలానే టీజర్ లో థ్రిల్, స్టైల్, స్టెప్ మూడూ కలగలిపిన షాట్ ఒకటి అందరినీ ఆకట్టుకుంటుందని టాక్. కాస్త త్వరగానే ఈ టీజర్ ని ఆడియన్స్ ముందుకి తీసుకు వచ్చేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోందట. ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ మాస్ మీల్స్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. అలానే టీజర్ లో లేటెస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట.