Homeసినిమా వార్తలు'ది రాజాసాబ్' రిలీజ్ వాయిదా ?

‘ది రాజాసాబ్’ రిలీజ్ వాయిదా ?

- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ది రాజా సాబ్. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజై మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచింది.

ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కొన్నాళ్లపాటు వాయిదా పడి డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధమైనట్లు ఇటీవల మేకర్స్ అయితే ఫైనల్ గా డేట్ ప్రకటించారు. 

ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమా వచ్చేది అది సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

READ  'అఖండ  - 2' క్రిస్మస్ కి వాయిదా పడనుందా ?

దీనిని పక్కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఆ మూవీ టీమ్ అయితే ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసింది. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే రానున్న సంక్రాంతికి మెగాస్టార్ 157 సినిమాకి ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా కి బాక్సాఫీస్ క్లాష్ కానున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ది రాజా సాబ్ మేకర్స్ నుంచి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది

Follow on Google News Follow on Whatsapp

READ  మరోసారి బాక్సాఫీస్ వద్ద క్లాష్ కానున్న దుల్కర్ - శివ కార్తికేయన్ మూవీస్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories