Homeసినిమా వార్తలుThe Raja Saab Latest Shoot Update 'ది రాజా సాబ్' షూట్ లేటెస్ట్ అప్...

The Raja Saab Latest Shoot Update ‘ది రాజా సాబ్’ షూట్ లేటెస్ట్ అప్ డేట్

- Advertisement -

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా కొనసాగుతున్నారు. మరి ఏ ఒక్క టాలీవుడ్ స్టార్ నటుడు చేయని విధంగా మొత్తంగా ఆరు సినిమాలతో ప్రభాస్ లైనప్ ఉంది. కాగా అందులో ప్రభాస్ చేస్తున్న ఒక సినిమా ది రాజా సాబ్. హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని యువ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ తమన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. రానున్న దసరా పండుగ కానుకగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల ది రాజా సాబ్ నుండి రిలీజ్ అయిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ యావరేజ్ రెస్పాన్స్ మాత్రమే అందుకున్నాయి. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల గ్రాండ్ గా  నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. 

అయితే విషయం ఏమిటంటే ఇంకా రాజా సాబ్ మూవీకి సంబంధించి కేవలం 10% టాకీ పార్ట్ అలానే మూడు సాంగ్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. ఇక ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని అది త్వరలోనే ఉండొచ్చని అంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని తప్పకుండా ఈ మూవీ భారీ విజయవంతం అని టీం ఆశాభావం వ్యక్తం చేస్తుంది

READ  Rishab Shetty Movies Lineup was Interesting ఇంట్రెస్టింగ్ గా రిషబ్ శెట్టి మూవీస్ లైనప్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories