పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి. దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న మూవీ ది రాజా సాబ్. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని రేపు సాయంత్రం 5 గం. 3 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషయల్ గా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్న ది రాజా సాబ్ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై దీనిని గ్రాండ్ లెవెల్లో వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం కనపడుతోంది.