అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ విడుదల తేదీ విషయంలో ఎన్నో వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ వేసవి 2023 ఏప్రిల్ 28న విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ చిత్రం అఖిల్ లుక్ తో పాటు సురేందర్ రెడ్డి బ్రాండ్ తో ప్రేక్షకులలో కొంత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అయితే సినిమాకు కొన్ని పాజిటివ్స్ వస్తున్నప్పటికీ ప్రమోషనల్ కంటెంట్ మాత్రం అందుకు విరుద్ధంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.
నిజానికి ఏ సినిమాకి అయినా సరేనిర్మాతలు ప్రమోషనల్ కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ కంటెంట్ ఎల్లప్పుడూ అంచనాలను పెంచేలా ఉండాలి మరియు బజ్ ను చంపకుండా ఉండాలి. కానీ అఖిల్ ఎజెంట్ విషయంలో అలా జరగడం లేదు.
ఈ చిత్రానికి ఇటీవలే విడుదల తేదీని ఖరారు చేస్తూ వచ్చిన టీజర్ ఎవరినీ ఆకట్టుకోలేదు సరి కదా.. అక్కినేని అభిమానులకు కూడా నచ్చడం లేదు. ఈ సినిమా రెగ్యులర్ రన్ ఆఫ్ ది మిల్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు కాబట్టి చిత్ర బృందం చాలా ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలి.
ఏకే ఎంటర్టైన్మెంట్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మేకర్స్ ఏమాత్రం ఖర్చుకి వెనుకాడకుండా యాక్షన్ సీక్వెన్స్ ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. తన గత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ యావరేజ్ పర్ఫార్మెన్స్ తర్వాత అఖిల్ ఈ ప్రాజెక్ట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు.
కాగా ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర అఖిల్ అక్కినేని ఏజెంట్ కి గురువుగా ఉంటుంది అని సమాచారం. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలవనుంది.