Homeసినిమా వార్తలుThe Paradise Glimpse Getting Ready for Release గ్లింప్స్ రిలీజ్ కి రెడీ అయిన...

The Paradise Glimpse Getting Ready for Release గ్లింప్స్ రిలీజ్ కి రెడీ అయిన నాని ‘ది పారడైజ్’ 

- Advertisement -

నాచురల్ స్టార్ నాని ఇటీవల సరిపోదా శనివారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సొంతం చేసుకున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. 

తాజాగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాతగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మూవీ ది పారడైజ్. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియన్ మూవీ దసరా అందరినీ ఆకట్టుకుని మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఈ మూవీకి అనిరుద్ సంగీతం సమకూర్చనుండగా మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ ని ఈ వారాంతంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే మరోవైపు ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా కూడా క్లోజ్ అయింది. 

నాని ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీ నాని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ మార్చి మొదటివారంలో కనపడుతోంది. తీవ్రాలో ఈ క్రేజీ మూవీ గురించిన మరిన్ని వివరాలు పూర్తిగా వెల్లడి కానున్నాయి. 

Follow on Google News Follow on Whatsapp

READ  Tollywood Production House Movies in Other Industries కోలీవుడ్, బాలీవుడ్ లో దూసుకెళ్తున్న టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories