ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా యూనానిమస్ ప్రొడక్షన్స్ తో కలిసి తన సొంతం సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు నాని.
ఇప్పటికే హిట్ 3 అందరిలో ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా దీని అనంతరం నాని చేయనున్న సినిమా తాజాగా ఫిక్స్ అయింది. గతంలో తనతో దసరా వంటి సక్సెస్ఫుల్ మూవీ తీసిన శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ అనే మూవీ చేయనున్నారు అని.
ఇక ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల రాగా రేపు అనగా మార్చి 3న దీని అనౌన్స్ మెంట్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. కాగా ఆ గ్లింప్స్ టీజర్ ని రేపు ఉదయం సరిగ్గా 11 గం. 17 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ టైం అనౌన్స్ చేసారు.
ఇక ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించనుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది.