Homeసినిమా వార్తలుఎట్టకేలకు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆది పురుష్

ఎట్టకేలకు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆది పురుష్

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి రానున్న తదుపరి చిత్రం ‘ఆదిపురుష్’ ప్యాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ చిత్రం. కాగా ఈ చిత్రం విజయం సాధించడం అనేది ఈ బాహుబలి స్టార్‌కి చాలా అవసరం. ప్రభాస్ నటించిన గత రెండు చిత్రాలు రాధే శ్యామ్, సాహో అందరూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పరాజయం పాలయ్యాయి. అందుకే ఆది పురుష్ సినిమా పై ప్రభాస్ చాలా జాగర్తలు తీసుకుంటున్నారు. అంతే కాక ఈ సినిమాని తెరకెక్కించే విషయంలో దర్శకుడు ఓం రౌత్ కూడా ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా చూసుకుంటున్నారు.

పౌరాణిక నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. ఇది తనకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన ప్రభాస్, అలాగే ఈ సినిమా తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆదిపురుష్ సినిమా తనకు సెంటిమెంట్‌ పరంగా కూడా చాలా ముఖ్యమైన సినిమా అని చెప్పిన ప్రభాస్.. ఓం రౌత్ లాంటి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడం తన అదృష్టంగా భావిస్తానని చెప్పారు. కాగా ఈ సినిమాలో నటించేందుకు మొదట్లో ప్రభాస్ భయపడ్డారట. షూటింగ్ మొదలైన మూడు రోజుల తర్వాత ఓం రౌత్ కు ఫోన్ చేసి ఈ సినిమా నేను చేయాలా? అని అడిగినట్లు ప్రభాస్ తెలిపారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలో తాను ఏదైనా పొరపాటు చేస్తే అది చాలా తప్పు అవుతుందని అన్నారాయన.

READ  ఆదిపురుష్ టీమ్ పై ఆగ్రహంతో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్

కాగా అక్టోబర్ 2న అయోధ్యలో భారీ ఈవెంట్‌లో ఆది పురుష్ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. టీజర్ విడుదల చేయడంతో ఈ సినిమా తాలూకు భారీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ చాలా పెద్ద ఈవెంట్‌లను ప్లాన్ చేస్తోంది అని కూడా అంటున్నారు. ఈ చిత్రం జనవరి 2023లో విడుదల కానుంది.

రామాయణం ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఆదిపురుష్ (రాముడు)గా ప్రభాస్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ మరియు సన్నీ సింగ్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  ఆగస్ట్ 25న విడుదల కానున్న నాగార్జున ది ఘోస్ట్ ట్రైలర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories