Homeసినిమా వార్తలుPK - SDT: పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం విడుదల తేదీ అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

PK – SDT: పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం విడుదల తేదీ అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం విడుదల గురించి ఆయన అభిమానులకు ఒక పవర్ ఫుల్ అప్ డేట్ వచ్చింది. పవన్ ప్రస్తుతం ఒకటికి మించి పెద్ద సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నారని మనకు తెలిసిందే. కాగా వాటిలో ఒకటి దర్శకుడు సముద్రఖనితో ఉందని కూడా మనకు తెలుసు, ఇది అయన తమిళ భాషలో తీసిన వినోదయ సితం యొక్క రీమేక్. పవన్ మేనల్లుడు, మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.

తాత్కాలికంగా PK-SDT అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మళ్లీ ముఖ్యాంశాల్లోకి వచ్చింది. జూలై 28, 2023న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

https://twitter.com/peoplemediafcy/status/1639207796267974657?t=JGyFOr392ToRctx0XD-xhA&s=19

ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా, థమన్ బాణీలు సమకూరుస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జి స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ కాల్పనిక నేపథ్యంలో రూపొందనున్న హాస్యభరిత చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

READ  Ram Charan: సల్మాన్ ఖాన్ - వెంకటేష్ ల కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ లో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో పాటు కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అంతే కాకుండా స్క్రిప్ట్‌లో మరిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మరింత అనుకూలంగా మార్చే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. గణనీయమైన మార్పులతో, ఈ చిత్రం ఒక ఆర్ట్ చిత్రంగా కాకుండా ఒక కమర్షియల్ చిత్రంగా రూపొందించబడుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ చిత్రాలకు కూడా ఇదే జరిగింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Kethika Sharma: పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించనున్న కేతికా శర్మ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories