Homeసినిమా వార్తలుJawan: సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా నుంచి లీకైన...

Jawan: సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా నుంచి లీకైన బైట్

- Advertisement -

అట్లీ కుమార్, షారుక్ ఖాన్ ల కాంబినేషన్లో వస్తున్న సినిమా జవాన్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, నయనతార తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కాగా కింగ్ ఖాన్ తో తలపడే ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటించనున్నారు. 2023 జూన్ 2న ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం షారుక్ ఖాన్ తొలి పాన్ ఇండియా చిత్రంగా ఉండబోతుంది.

బాలీవుడ్ వర్గాల నుంచి అందిన తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలోని ఒక ఫైట్ సీన్ లీక్ అయిందని తెలియ వచ్చింది. కాగా ఈ లీకైన సన్నివేశం వీరోచితమైన విధంగా ఉంది. నోట్లో సిగార్ పెట్టుకుని కొందరు దుండగులను బెల్టుతో కొట్టడం చూడవచ్చు.

కాగా ఈ వీడియోలో షారుఖ్ స్వాగ్ అద్భుతంగా ఉంది, యాక్షన్ ఎపిసోడ్ మాస్ టచ్ తో సూపర్ ట్రీట్ లా అనిపిస్తుంది. లీకైన ఈ వీడియో కేవలం షారుఖ్ అభిమానుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఇతర బాలీవుడ్, సౌత్ ప్రేక్షకులు కూడా ఈ లీకైన బైట్ చూసి ఫిదా అయిపోయారు.

READ  Pathaan: తొలి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరిన 5వ భారతీయ చిత్రంగా నిలిచిన పఠాన్

పక్కా మాస్ ఎలిమెంట్స్ తో భారీ కమర్షియల్ సినిమాలు తీయడంలో దర్శకుడు అట్లీ దిట్ట అని పేరు పొందారు. కమర్షియల్ సినిమాలకు ఆయనను మాస్టర్ గా భావిస్తారు. ఇక జవాన్ సినిమాతో ఆయన ఇండియన్ సినిమాకి మాస్ ఫీస్ట్ ఇస్తారని అందరూ ఆశిస్తున్నారు.

జవాన్ లో షారుక్ ఖాన్ రెండు పాత్రల్లో కనిపిస్తారని, ఈ సినిమాలో పెద్ద పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పఠాన్ ఘన విజయంతో షారూఖ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. తమ హీరో తన తదుపరి చిత్రంతో కూడా ఆ ఫామ్ ను కొనసాగించాలని వారు కోరుకుంటున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Naresh: నటుడు నరేష్‌ క్యారవాన్‌ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories